హెలికాప్ట‌ర్ క్రాష్.. ముగ్గురు మృతి

By Ravi
On
హెలికాప్ట‌ర్ క్రాష్.. ముగ్గురు మృతి

జ‌పాన్‌ లో ఓ మెడిక‌ల్ ట్రాన్స్‌పోర్టు హెలికాప్ట‌ర్ కూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘ‌ట‌న ఆ దేశ నైరుతీ దిశ‌లో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో పేషెంట్‌ తో పాటు ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. పైల‌ట్ హిరోషి హ‌మ‌దా, హెలికాప్ట‌ర్ మెకానిక్ క‌జుటో, 28 ఏళ్ల న‌ర్సు స‌కురా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ముగ్గుర్నీ కోస్టు గార్డులు రెస్క్యూ చేశారు. కాగా ఈ ఘటనలో ముగ్గురూ హైపోథ‌ర్మియాతో బాధ‌ప‌డ్డారు. కానీ స్పృహ‌లో ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో మెడిక‌ల్ డాక్ట‌ర్ కీవ్ అర‌కావా, పేషెంట్ మిత్సుకీ మోటోషి, ఆ పేషెంట్ కేర్‌టేక‌ర్ క‌జుయోషి మోటిషి ఉన్నారు. 

ఆ ముగ్గురి మృత‌దేహాల‌ను జ‌పాన్ ఎయిర్ సెల్ఫ్ దిఫెన్స్ ఫోర్స్ హెలికాప్ట‌ర్ రిక‌వ‌రీ చేసింది. రెస్క్యూ ఆప‌రేష‌న్ కోసం రెండు విమానాలు, మూడు నౌక‌ల‌ను కోస్టు గార్డులు మోహ‌రించారు. నాగ‌సాకి జిల్లా నుంచి ఫుకునోవా హాస్పిట‌ల్‌కు వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. ఏ కార‌ణం చేత ప్ర‌మాదం జ‌రిగిందో ద‌ర్యాప్తులో తేలాల్సి ఉన్న‌ది. కాగా బాధిత కుటుంబాలకు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News

అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు
దారుఢ్యం కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు మరియు క్యాప్సూల్స్‌ను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ....
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!
అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం
16 ఏళ్ల అమ్మాయిపై బ్యాడ్మింట‌న్ కోచ్ అరాచకం
ఆర్సీబీపై బుమ్రాకు అదిరిపోయే రికార్డ్