ట్రంప్ కి వ్యతిరేకంగా హ్యాండ్స్ ఆఫ్ నిరసనలు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలన్ మస్క్ కి వ్యతిరేకంగా ప్రస్తుతం యూఎస్ లో నిరసనలు చేపట్టారు. హ్యాండ్స్ ఆఫ్ అనే పేరిట నిరసన ప్రదర్శనలతో ఆందోళనకారులు ముందుకెళుతున్నారు. ట్రంప్ పరిపాలన విధానాలు వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఉద్యోగాల కోతపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన సపోర్ట్ ను తెలిపారు. కాగా ట్రంప్ తీరుపై కోపంతో ఉన్న అమెరికన్లు అక్కడ పలు నగరాల్లో ర్యాలీలు చేశారు. ఈ నిరసనలు మొత్తం యూఎస్‌లోని 50 రాష్ట్రాల్లోని 1200 కన్నా ఎక్కువ ప్రదేశాల్లో జరిగాయి. వీటిలో పౌరహక్కుల సంస్థలు, కార్మిక సంస్థలు సహా 150 పైగా సంఘాలు పాల్గొన్నాయి.
కాగా న్యూయార్క్‌లోని అలాస్కా, వాషింగ్టన్ వరకు ఉన్న నగరాల్లో నిరసనకారులు ట్రంప్ కు, మస్క్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సియాటల్, పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్, లాస్ ఏంజిల్స్ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనల గురించి వైట్ హౌజ్ రెస్పాన్డ్ అయ్యింది. అధ్యక్షుడు ట్రంప్ వైఖరి స్పష్టంగా ఉందని, అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆయన ఎల్లప్పుడూ సామాజిక భద్రత, మెడికల్, డెమొక్రాట్ల వైఖరి అక్రమ వలసదారులకు సామాజిక భద్రత, మెడికేర్ అందించిందని, ఇది ఈ కార్యక్రమాలను దివాళా తీసేలా చేసిందని, అమెరికన్లను అణిచివేసిందని ఓ ప్రకటనలో తెలిపారు.