బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం

By Ravi
On
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం

హైదరాబాద్‌ పాతబస్తీ ఫతేదర్వాజ ప్రాంతంలో కలకలం రేగింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తానని మోసం చేశారంటూ బాధితులంతా ఆస్పత్రికి క్యూ కట్టారు. ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టీసిపెంట్‌కి జుట్టు మొలిపించానంటూ వకీల్‌ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశాడు. దీంతో చాలా మంది ఈయన సెలూన్ ముందు క్యూ కట్టారు. వచ్చినవారందరికి వకీల్ గుండు గీసి కెమికల్ రాసి పంపించాడు. తీరా ఇంటికి వెళ్లాక జుట్టు రాకపోగా.. సైడ్ ఎఫెక్ట్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. మరోవైపు కాలాపత్తర్ పోలీసులు మాత్రం ఇంకా తమకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందలేదని.. అందితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

Tags:

Advertisement

Latest News

అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు
దారుఢ్యం కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, టాబ్లెట్‌లు మరియు క్యాప్సూల్స్‌ను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ....
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!
అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం
16 ఏళ్ల అమ్మాయిపై బ్యాడ్మింట‌న్ కోచ్ అరాచకం
ఆర్సీబీపై బుమ్రాకు అదిరిపోయే రికార్డ్