మురారిలో పండగ వాతావరణం లో పల్లె పండుగ

By Ravi
On
మురారిలో పండగ వాతావరణం లో పల్లె పండుగ

కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు సిసి డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

V.ananthkumar TNP
Jaggampeta

కాకినాడ జిల్లా గండేపల్లి ఏప్రిల్ 4: గండేపల్లి మండలం మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని పండగ వాతావరణం లో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు సిసి డ్రైన్లు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్, కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమ స్కూల్ కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు థాంక్యూ ఎమ్మెల్యే సార్ అనే పే కార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గం లోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని రెండో సంవత్సరంలో సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గండేపల్లి, మల్లేపల్లి గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, కుంచె రాజా, కందుల చిట్టిబాబు, అడబాల భాస్కరరావు, జాస్తి వసంత్, సుంకవిల్లిరాజు, బొల్లం రెడ్డి రామకృష్ణ, సుంకవిల్లి రమేష్, వెంపాటి రాజు, ఇప్పర్ల సురేష్, కురుకూరి చౌదరి,పంచాయతీరాజ్ డిఇ ఉమా శంకర్, జే ఇనారాయణమూర్తి, మండల అభివృద్ధి అధికారి నాతి బుజ్జి, ఎమ్మార్వో, ఎస్సై శివ నాగబాబు, అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..