హెచ్ సియు ఎఫెక్ట్.. రోడ్లపైకి చేరుతున్న జింకలు
By Ravi
On
హైదరాబాద్, ఏప్రిల్ 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న చెట్ల నరికివేత ప్రభావం వన్యప్రాణులపై స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లోని ఒక నివాసంలోకి ఓ జింక ప్రవేశించినది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, యూనివర్సిటీ పరిధిలో చెట్లు తొలగించడం వల్ల తమ సహజ వాతావరణం కోల్పోయిన జింకలు నివాస ప్రాంతాల వైపు తరలుతున్నాయి. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ నగర్లోని ఓ ఇంటి ఆవరణ లోకి ఓ జింక వచ్చితిరిగి వెళ్లలేక భయంతో తిరుగుతూ కనిపించింది.
ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలు ఈ సంఘటనపై కలవరపడుతూ, చెట్ల తొలగింపుతో వన్యప్రాణులకు ఆశ్రయం లేకుండా పోతోందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
Tags:
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...