డ్రగ్స్ వద్దు బ్రో.. - కాకినాడ జిల్లా ఎస్.పి.జి.బిందు మాధవ్
V.ananthkumar TNP
Jaggampeta
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ నందు 'సైబర్ క్రైమ్' అవేర్నెస్, "డ్రగ్స్ వద్దు బ్రో.. " మరియు "శక్తి యాప్" పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కాకినాడ జిల్లా ఎస్.పి జి.బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిత్య కు విచ్చేసిన ఎస్.పి.జి.బిందు మాధవ్ కు యూనివర్సిటీ ఛాన్సలర్ డా. నల్లమిల్లి శేషారెడ్డి ,ప్రో.ఛాన్సలర్ డా. నల్లమిల్లి సతీష్ రెడ్డి, డిప్యూటీ ప్రో. ఛాన్సలర్. డా. మేడపాటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ డా. ఎం.బి శ్రీనివాస్, పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. . యూనివర్సిటీ ప్రో.ఛాన్సలర్ డా. నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిధి ఎస్. పి. జి.బిందు మాధవ్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ వాడినా , రవాణా చేసిన చాలా నష్టపోతారు అనీ, విద్యార్థులందరూ ఈ విషయం పై అవగాహన కలిగి ఉండాలని కోరారు. డ్రగ్స్ తీసుకున్న , కలిగి ఉన్న,రవాణా చేసినట్లు దొరికిన విద్యార్థులు ఎటువంటి కఠినమైన శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుందో సెక్షన్ లతో సహా వివరించారు. ఏ విద్యార్థి అయినా డ్రగ్స్ కేసులో నేరం రుజువైతే అతనికి చట్టరీత్యా కఠినమైన శిక్షలు అనుభవిం చవలసి రావడమే కాకుండా ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును కోల్పోవలసి వస్తుంది అని తెలిపారు. అంతే కాకుండా జీవితంలో విద్యార్థి దశ ఎంతో విలువైనది దానిని సక్రమ మార్గంలో నడుచుకుంటూ ఉన్నత చదువులు అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని, ప్రలోభాలకు మానసిక దౌర్బల్యం తో డ్రగ్స్ వంటి చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని సూచించారు. శక్తి ఆప్ గురించి మహిళలు అవగాహన కలిగి ఉండాలని విపత్కర సంఘటనలు ఎదురైనప్పుడు కేవలం మొబైల్ ను షేక్ చేయడం ద్వారా పోలీస్ అధికారులు రక్షణ లభిస్తుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శక్తి ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి అని చెప్పారు. అదే విధంగా మన రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య సైబర్ క్రైమ్ అని దీని ద్వారా అనేక మంది అవగాహన లేని కారణంగా అధిక మొత్తంలో డబ్బులు నష్టపోతున్నారని కావున అటువంటి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసిన యడల వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఒక వేళ సైబర్ క్రైం లో నష్టపోతే మొదటి అరగంట లో అధికారులకు తెలియపరిచిన రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్.పి.జి.బిందు మాధవ్ ను ఆదిత్య యాజమాన్యం తరపున దుశ్శాలువా జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ డా. నల్లమిల్లి శేషారెడ్డి,ప్రో.ఛాన్సలర్ డా. నల్లమిల్లి సతీష్ రెడ్డి, డిప్యూటీ ప్రో. ఛాన్సలర్. డా. మేడపాటి శ్రీనివాస్ రెడ్డి,వైస్ ఛాన్సలర్ డా. ఎం.బి శ్రీనివాస్, పెద్దాపురం డి.ఎస్.పి. సి.ఆర్. రాజు,ఎస్.బి.డి.ఎస్. పి. శ్రీరామ్ కోటేశ్వరరావు, ట్రైనింగ్ డి.ఎస్. పి. సిహెచ్. జీవన, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై.ఆర్.కె. శ్రీనివాస్, గండేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివనాగు, డా. టి. నీలిమ,వివిధ విభాగాధిపతులు ఇతర అధ్యాపక సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.