నాణ్యతలేని కోటా బియ్యం - పట్టణ ప్రజల ఆరోపణ
MAHESH, MANDAPETA, TPN
మండపేట లో ఈ నెల సరఫరా చేసిన పి డీ ఎఫ్ బియ్యం నాసిరకం గా వుందని ప్రజలు ఆరోపించారు. మండపేట 11 వ వార్డు లో ఏప్రియల్ నెల లో సరఫరా చేసిన కోటా బియ్యం కడిగితేనే నూక మాదిరి తయారు అవుతుందని అక్కడి స్థానికులు ఆరోపించారు. ఆ వార్డు కు చెందిన చుండ్రు సత్యనారాయణ ఆ బియ్యాన్ని కడిగి మీడియా కు చూపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన బియ్యం ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ సారి కొత్త బియ్యం సరఫరా చేశారని నాణ్యత లేని బియ్యం పేదలకు సరఫరా చేశారని మండి పడుతున్నారు. బియ్యం సరఫరా వాహనం వద్దే అమ్ముకునే వారికి డబ్బులు వచ్చేస్తున్నాయని, పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇదే అన్నం అని అవేదన వ్యక్తం చేశారు. బియ్యం నీటి లో కడిగిన వెంటనే నూక మాదిరి గా అవుతుంది. బియ్యం ముద్దగా ఉడుకుతుంది. దీంతో తినే అవకాశం లేకుండా పోతుందని చెబుతున్నారు. నాణ్యత పరిశించాల్సిన అధికారులు తీరు ను ప్రశ్నిస్తున్నారు. పేదల బియన్ని యదేచ్చగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శలు వున్నాయి. దీనిపై పౌర సరఫరాల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే నెల లో అయినా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.