సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన నివాళి

By Ravi
On
సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన నివాళి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315వ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శనీయుడని  భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఢిల్లీలో సర్వాయి పాపన్న 315వ వర్ధంతి సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్వాయి పాపన్న అని కీర్తించారు. సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీత కార్మికుడిగా కొనసాగిన తన ప్రస్థానంలో అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్న అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, ఎంపీ కావ్య, పోరిక బలరాం నాయక్, రఘురాం రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

Tags:

Advertisement

Latest News

ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..? ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!