సర్వాయి పాపన్న గౌడ్ గారికి ఘన నివాళి
By Ravi
On
బహుజన పోరాట యోధుడు, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటేలా ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. పాలనలో సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేసి, వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం. బహుజనుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటు పడింది. పాపన్న గౌడ్ గారి గొప్ప సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగుదాం- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Tags:
Latest News
19 Apr 2025 17:24:01
- ఇటీవల సెల్లార్ తవ్వుతుండగా ముగ్గురు కార్మికుల మృతి - అది మరవక ముందే సర్కిల్- 5లో మళ్లీ తవ్వకాలు - చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ టౌన్...