మంచు విష్ణుపై మనోజ్‌ ఫిర్యాదు..!

By Ravi
On
మంచు విష్ణుపై మనోజ్‌ ఫిర్యాదు..!

మరోసారి మంచు ఫ్యామిలీ పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కింది. నార్సింగిలో సోదరుడు మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతోపాటు వస్తువులను దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జల్‌పల్లిలోని ఇంటిలో కూడా 150 మంది చొరబడి విధ్వంసం చేశారని ఆరోపించారు. తన ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను కూడా ఎత్తుకొని వెళ్లారని కంప్లైంట్‌ చేశారు. తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయని చెప్పారు. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని తెలిపారు. ముఖ్యమైన వస్తువులన్నింటిని ధ్వంసం చేశారని ఆరోపించారు. తన కూతురు బర్త్‌డే కోసం తాను రాజస్థాన్ వెళ్లగా.. విష్ణు తన ఇల్లుని ధ్వంసం చేశారిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించానని.. కానీ ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. తనకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

Advertisement

Latest News

ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..! ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..!
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో.. డ్రోన్‌ కెమెరాలతో చిరుత సంచారాన్ని...
తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..