జాతీయ రహదారిపై ప్రమాదం, లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

By Ravi
On
జాతీయ రహదారిపై ప్రమాదం, లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Screenshot 2025-03-30 092439రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్:

కడప జిల్లా బద్వేల్ నుండి వస్తున్న BCVR ట్రావెల్స్‌కు చెందిన ఓల్వా బస్సు, కొత్తూరు బైపాస్ జాతీయ రహదారిపై గత రాత్రి ప్రమాదానికి గురైంది. బస్సు, ముందు వెళ్ళిన లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, లారీ ఒక్కసారిగా బ్రేకులు వేసిన వెంటనే బస్సు డ్రైవర్ అందుకు స్పందించకపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ, బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి కూడా గాయాలు జరిగాయి. గాయపడిన వారిని వెంటనే శంషాబాద్ హాస్పిటల్‌కు తరలించారు.

బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు, క్రేన్ మరియు వెల్డింగ్ కట్టర్ల సహాయంతో బస్సు ప్రైమ్ ను తొలగించి బయటకు తీశారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ విచారణ జరిపారు.

Tags:

Advertisement

Latest News

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!  సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
సంగారెడ్డి TPN :  బీడీఎల్‌ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న  కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం...
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..