కొడంగల్ పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా

By Ravi
On
కొడంగల్ పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా

  • అందరికి ఇంటిస్థలం, ఇందిరమ్మ ఇళ్లు
  • అర్హత కలిగిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
  • వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
  • తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ

వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు భరోసా ప్రకటించారు. భూములు అందించిన రైతులందరికి ఇంటి స్థలం లేదా ఇందిరమ్మ ఇంటిని ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

కోడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు దుద్యాల మండలం, హకీంపేట్, లగచర్లకు చెందిన 25 మంది రైతులు వారికి చెందిన 31.08 ఎకరాల భూములు అందించారు.

వారికి ప్రభుత్వం ద్వారా రూ.6కోట్ల 20లక్షల పరిహారం మంజూరైంది. ఈ మేరకు శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులకు నష్టపరిహార చెక్కులను పంపిణీ ఏర్పాటు చేశారు.

Tags:

Advertisement

Latest News

అక్రమ ఔషధాలు సీజ్‌..! అక్రమ ఔషధాలు సీజ్‌..!
అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు....
వ్యక్తిపై బండరాయితో దాడి..!
సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!
11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి..!
వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!
శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం..!