రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 227వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

By Ravi
On
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 227వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

విజయవాడ, 28 మార్చి 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ యొక్క 227వ బోర్డు సమావేశం విజయవాడ, కానూరు సివిల్ సప్లై భవనంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి మంజీర్ జిలాని, కమిషనర్ సౌరబ్ గౌర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ, రబీ కొనుగోళ్ల ప్రారంభం ఏప్రిల్ నుండి జరుగుతుందని తెలిపారు. అలాగే, కరీఫ్ సీజన్లో 35,48,724 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబడినట్లు వివరించారు. ఈ సీజన్‌లో 5,61,216 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, 8,138 కోట్ల రూపాయలు నగదు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగినట్లు తెలిపారు.

R.S.Kలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, తద్వారా వచ్చే ఖరీఫ్ నాటికి మరింత సమర్థవంతమైన ధాన్యం కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

దీపం-2 పథకం ద్వారా, ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 98 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత సిలిండర్ పొందారని మంత్రి పేర్కొన్నారు.

ప్రైవేటు గోడౌన్‌ల వద్ద AI కెమెరాలు, సోలా ప్యానెల్‌లు ఏర్పాటు చేయడం, గ్రీన్ ఎనర్జీ వినియోగం ప్రోత్సహించడం తదితర అంశాలపై కూడా సమీక్ష జరిగిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భద్రత పెంచేందుకు, AI కెమెరాల ద్వారా గోడౌన్‌లలో భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం కింద 1,14,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం హాస్టల్స్‌కు అందజేస్తున్నట్లు తెలిపారు. తృణధాన్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, రాగి, కొర్రలు, సజ్జలు చౌక ధర దుకాణాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!