ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు
కృష్ణాజిల్లా, మార్చి 28:
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ఉంగుటూరు మండలం లోని ఆత్కూరు గ్రామంలో నిర్వహించనున్న శ్రీ విశ్వ వసు నామ సంవత్సర ఉగాది సంబరాలలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రేరణతో ఈనెల 30వ తేదీన జరుగనుంది.
ఈ సందర్భంగా, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, స్వర్ణ భారత్ ట్రస్ట్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఎంహెచ్వో చరిష్మా, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, "సీఎం చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించాం. తదుపరి, సుధీర్ ఫార్మా కంపెనీ నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని" వెల్లడించారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకలకు హాజరై, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతారని ఆయన తెలిపారు.