పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ

By Ravi
On
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ

హైదరాబాద్ TPN : పశ్చిమబెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, వివేకానంద జిల్లా అధ్యక్షులు పురుషోత్తమ్ రెడ్డి అన్నారు. పశ్చిమ్‌బెంగాల్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ దిల్‌సుఖ్‌నగర్ రహదారిపై వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వందలాది మంది వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు నవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొందరూ ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపారని, ఆస్తులను ధ్వంసం చేసి లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది హిందువులు ఇళ్లను ఖాళీ చేసి పోయారని తెలిపారు. మమతా బెనర్జీ హిందువులకు రక్షణ కల్పించలేకపోతున్నారని.. ఓటు బ్యాంక్ కోసం దేశ భద్రతకే ఆటంకంగా మారారని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించి హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్‌మాహేశ్వర్ రెడ్డి, సరూర్‌నగర్ కార్పొరేటర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!