కృష్ణాజిల్లా గుడివాడలో డ్రోన్ ఆధారిత పోలీసింగ్
చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధించేందుకు చర్యలు
గుడివాడ, కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుడివాడ డిఎస్పీ శ్రీ ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో, గుడివాడ రూరల్ సిఐ శ్రీ ఎస్ ఎల్ ఆర్ సోమేశ్వరావు పర్యవేక్షణలో, గుడివాడ రూరల్ ఎస్సైN చంటిబాబు మరియు వారి సిబ్బంది డ్రోన్ ఆధారిత పోలీసింగ్ చేపట్టారు.
ఈ చర్యలో, టిడ్కో హౌస్ పరిసర ప్రాంతాలలో బహిరంగంగా మద్యపానం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, డ్రోన్ నిఘా ద్వారా, ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారని, టిడ్కో హౌస్స్ పరిసర ప్రాంతాలలో మరిన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసు చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
ఈ విధంగా డ్రోన్ ఆధారిత నిఘా వల్ల, మద్యపానాలు, హక్కుల ఉల్లంఘనల వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు తగ్గించేందుకు పోలీసుల చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయి.