చర్చి గోడల పై హిందూ మత రాతలు రాసిన వారిని అరెస్టు చేసిన శ్రీకాకుళం పోలీసులు
TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 03/04/25
శ్రీకాకుళం టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్.సీ.ఎం సెయింట్ థామస్ చర్చి లోపల చర్చి కాంపౌండ్ గోడపై అదేవిధముగా చిన్న బజార్ రోడ్, తెలుగు బాప్టిస్టు చర్చ్ లోపల మరియు చర్చి కాంపౌండ్ గోడపై "జై శ్రీరామ్" అని రాసిన వారిపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి, నేరమునకు పాల్పడిన వారిని గుర్తించి,అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు.
పిర్యాదు వివరములు : శ్రీకాకుళం 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్.సీ.ఎం సెయింట్ థామస్ చర్చ్, అంతే కాకుండా, టౌన్ హాల్ రోడ్ నుండి వారు చిన్న బజార్ రోడ్ నకు చేరి అక్కడ యున్న తెలుగు బాప్టిస్టు చర్చ్ కాంపౌండ్ గోడపై ఎర్రని రంగుతో "జై శ్రీరామ్" అని తెలుగులో రంగుతో వ్రాసి అనంతరం, ఇద్దరూ కలిసి సుజుకీ యాక్సస్పై పై అక్కడి నుండి వెళ్లిపోయినట్లు ఇచ్చిన రిపోర్టుపై శ్రీకాకుళం 1, 2 .వ పట్టణ ఠాణా వారు కేసు నమోదు చేసినారు.
పై కేసు నందు ముద్దాయిలను అదుపులోనికి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి కేసు చేదించడంలో DSP శ్రీ సి.హెచ్. వివేకానంద మరియు శ్రీకాకుళం రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.పైడపు నాయుడు, పర్యవేక్షణలో ప్రతిభా కనబరిచిన, సబ్ ఇన్సపెక్టర్స్, శ్రీకాకుళం 1 .వ పట్టణ పోలీస్ స్టేషన్, గార పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం హోమ్ గార్డ్ నరేష్ మరియు సిబ్బంది లను జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
ఆలయాలు, చర్చ్ లు, మసీదులు,వంటి ప్రార్ధన మందిరాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యలు,జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి ఐపీఎస్ తెలిపారు.
మత సామరస్యానికి భంగం కలిగించేలా, ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధముగా ఇతర మతాల మనోభావాలు కించపరిచేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.
కుల, మత, రాజకీయ వర్గాల మధ్య , మతపరమైన,అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులను ఎవరైనా పెట్టినట్లు గుర్తిస్తే, వారిపై కేసులు నమోదు చేసి, కఠిన శిక్షలు అమలు చేయబడును ఆని జిల్లా ఎస్పీ తెలిపారు