వైసీపీ హయాంలో పోలవరానికి ఊహించని నష్టం: సీఎం చంద్రబాబు

By Ravi
On
వైసీపీ హయాంలో పోలవరానికి ఊహించని నష్టం: సీఎం చంద్రబాబు

WhatsApp Image 2025-03-27 at 7.23.28 PMఏలూరు/పోలవరం: ప్రధాన మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ పాలనలో జరిగిన తప్పుల వల్ల పోలవరం ప్రాజక్టు కు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ హయాంలో జరిగిన తప్పులు చరిత్రలో క్షమించలేని నేరమని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో చెప్పారు. పోలవరం ప్రాజక్టు, జాతీయ ప్రాజక్టుగా ఉన్నప్పటికీ, వైసీపీ పాలనలో ప్రాజక్టు పనులు అడ్డుకుంటూ, ప్రజల ఆస్తి ను నాశనం చేయడాన్ని ఆయన కఠినంగా విమర్శించారు.

ప్రాజక్టు పనుల ఆలస్యం, డయాఫ్రమ్ వాల్ ను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల బాగా నష్టం జరిగిందని, కాఫర్ డ్యామ్ ను ముందుగా పూర్తిచేస్తే ఇంత నష్టం జరగలేదని చెప్పారు.

వైసీపీ పాలనలో ప్రాజక్టు కు ఊహించని నష్టం జరిగిందని, ఐదేళ్ల పాటు అట్టే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు.

ప్రాజక్టు విషయంలో జాగ్రత్తలను పీపీఏ అథారిటీ మరియు కేంద్ర ప్రభుత్వం ముందుగా సూచించినా, గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని విమర్శించారు.

వైసీపీ పార్టీకి ఓట్లేసినందుకు రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారని, రాజకీయ కక్షతో రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజక్టుపై కక్ష తీర్చుకున్నారని ఆయన ఆరోపించారు.

తాము అధికారంలోకి వచ్చాక, నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేసి డయాఫ్రమ్ వాల్ ని మళ్లీ నిర్మించాలని నిర్ణయించామని, ఈ నిర్మాణం కోసం రూ. 990 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

ప్రాజక్టు 2020లో పూర్తికావాల్సి ఉండగా, ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే పరిస్థితి ఏర్పడిందని, డిసెంబర్ 31 నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందని స్పష్టం చేశారు.

ఇతర పనులు డిసెంబర్ 26 నాటికి పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామని, ఎడమవైపు అనుసంధానం జూన్ 26 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2 డ్యామ్ పూర్తి చేస్తామని, పోలవరం ప్రాజక్టు కట్టాలనే ప్రణాళికలు 1941లోనే సిద్ధమయ్యాయని, అప్పుడు ప్రాజక్టు కట్టలేక ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినట్లు వివరించారు.

ప్రాజక్టు లేకపోవడంతో 2,000 టీఎంసీ నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుందని, 400 టీఎంసీ నీరు వాడుకుంటే ఏపీని కరవు రహితంగా మార్చవచ్చని చెప్పారు.

విభజన చట్టం ప్రకారం, పోలవరం ప్రాజక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడ్డదని, ఇప్పుడు పోలవరం ప్రాజక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

73 శాతం పనులు తాము అధికారంలో ఉన్నప్పుడు పూర్తయ్యాయని, పట్టిసీమ ప్రాజక్టు కూడా పోలవరం ఆలస్యం కాకుండా చేపట్టినట్లు ఆయన చెప్పారు.

ఎడమ ప్రధాన కాలువ పనులను కూడా వేగవంతం చేశామని చంద్రబాబు వివరించారు.

Tags:

Advertisement

Latest News

ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..! ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
హైదరాబాద్‌ TPN:  జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలాజీ లే అవుట్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న తేజ అనే 30...
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి : టీజీవో
ఏపీ లిక్కర్‌స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు..!
మమత హాస్పిటల్‌లో అరుదైన శస్త్ర చికిత్స..!
జనసేనలోకి గ్రేటర్ విశాఖ వైసీపీ కార్పొరేటర్లు..!