ఓటీఎస్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపునకు ఇంకా నాలుగు రోజులే గడువు.. కమిషనర్ ఇలంబర్తి

By Ravi
On
ఓటీఎస్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపునకు ఇంకా నాలుగు రోజులే గడువు.. కమిషనర్ ఇలంబర్తి

హైద‌రాబాద్, మార్చి 27: జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఇలంబర్తి ప్రకటనలో, జిహెచ్ఎంసి కల్పించిన వన్ టైమ్ స్కీమ్ (OTS) పథకానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఈ నెల 31 లోపు బకాయి ఉన్న ఆస్తి పన్నును చెల్లించి, ఓటిఎస్ ద్వారా వడ్డీ పై 90 శాతం రాయితీ పొందాలని సూచించారు.

ఆస్తి పన్నును ఆన్‌లైన్‌, సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, ఈ-సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని, సర్కిల్, హెడ్ ఆఫీసులోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు. ఇంటి వద్దకు వచ్చే బిల్ కలెక్టర్‌ల ద్వారా కూడా పన్ను చెల్లించి, రాయితీతో కూడిన రశీదులు పొందవచ్చని సూచించారు. అలాగే, ఆన్‌లైన్‌లో మరియు మైజిహెచ్ఎంసి యాప్ ద్వారా కూడా ఆస్తి పన్ను చెల్లించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

పన్ను చెల్లించిన వారు నగర అభివృద్ధికి కీలకమైన పాత్ర పోషించడాన్ని గుర్తించి, కమిషనర్ ఇలంబర్తి మరింతగా ప్రజలను ప్రోత్సహించారు.

Tags:

Advertisement

Latest News

అల్లకల్లోలం.. తెల్లవార్లు నగర దిగ్భంధనం.. అల్లకల్లోలం.. తెల్లవార్లు నగర దిగ్భంధనం..
గతరాత్రి నగరంలో కురిసిన భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. అనేక ప్రాంతాలు, బస్తీలు, కాలనీలు చివరకు ప్రధాన రహదారులు సైతం వర్షం నీటితో నిడిపోయే చెరువుల మారడంతో...
ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి
చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title