పాస్టర్ ప్రవీణ్ భౌతికకాయనికి నివాళులు అర్పించిన పాస్టర్లు
సికింద్రాబాద్: ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ భౌతిక కాయాన్ని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సందర్శకుల అభిమానుల కోసం ఉంచారు. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పాస్టర్లు సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటని, ఆయన మరణం అనుమానాస్పదంగా జరగడం క్రైస్తవ కర్మకాండ మరియు సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని వారు చెప్పారు. కొంతమంది మతోన్మాద శక్తులు ఆయనను హతమార్చారని ఆరోపిస్తున్నారు.
సువార్త చెప్పేందుకు వెళ్ళిన ఆయనపై దాడి చేసి, రహదారి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనల వల్ల దేశంలో శాంతి భద్రతలకు దెబ్బ తినడం, క్రైస్తవులకు రక్షణ లేకుండా పోవడం అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల పాస్టర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల సందర్శన తర్వాత, పగడాల ప్రవీణ్ అంత్యక్రియలు సెయింట్ జాన్స్ సిమెట్రీలో నిర్వహించనున్నారు.