పాస్టర్ ప్రవీణ్ చివరిచూపుకు భారీగా అభిమానులు

సికింద్రాబాద్ లో సెంటనరీ బాప్టిస్టు చర్చిలో పాస్టర్ ప్రవీణ్ భౌతికకాయం

By Ravi
On
పాస్టర్ ప్రవీణ్ చివరిచూపుకు భారీగా అభిమానులు

సికింద్రాబాద్ లోని  సెంటనరీ బాప్టిస్టుచర్చిలో సందర్శకుల కోసం ఉంచారు. ఆయన అభిమానులు, క్రైస్తవులు భారీగా తరలి వచ్చారు. 

హైదరాబాద్: అనుమానాస్పద స్ధితిలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ భౌతికకాయాన్ని సికింద్రాబాద్ లోని  సెంటనరీ బాప్టిస్టుచర్చిలో సందర్శకుల కోసం ఉంచారు. ఆయన అభిమానులు, క్రైస్తవులు భారీగా తరలి వచ్చారు. ఆయన చాలా మంచివాడంటూ కన్నీరు పెడుతున్నారు. ఆయనకు హాని తలపెట్టినవారు ఎవరైనా సరే లెక్క చెప్పక తప్పదని కొందరు కామెంట్ చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తన బుల్లెట్ పై ప్రయాణించారు. అయితే రాజానగరం వద్ద ఆయన రోడ్డుపై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి మరణించారని చెబుతున్నారు. పాస్టర్ అభిమానులైతే ఇది ఎవరో చేసిన పనేనని అనుమానపడుతున్నారు. పోలీసులు అయితే ఇంకా విచారణ చేస్తున్నామని.. ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు దొరకలేదని వివరించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు బాప్టిస్ట్ చర్చిలో  ఫాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

Latest News