సేమ్ బ్యారక్... సేమ్ జైలు.....?

By Ravi
On
సేమ్ బ్యారక్... సేమ్ జైలు.....?

 జగన్ అరెస్టుకు సర్వం సిద్ధం
 ఏడాది తిరగకుండానే కారాగారానికి..?
 జనంలోకి ఎప్పుడొస్తారా అని వెయిటింగ్..?
 లిక్కర్ స్కాంలో లింకులు దొరికేసినట్టే
 అమిత్ షా ఓకే అంటే... అయిపోయినట్టే
 రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు
 గవర్నర్ అనుమతితో అరెస్ట్ కు వ్యూహం

SPL Correspondent, TPN : కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి... ఏడాది పూర్తి కాకముందే... ప్రతిపక్షం వైసీపీకి ఎన్నో షాక్ లు తగిలాయి. గుక్క తిప్పుకోనీకుండా వైసీపీ నేతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇంకా ఇలాంటి షాక్ లు తగులుతూనే ఉన్నాయి.  మరో రెండు నెలలు ఆగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఆ సమయం వచ్చే లోపే... పెద్ద తిమింగలాన్ని లోపలేసెయ్యాలనే స్కెచ్ రెడీగా ఉందట. ఒకప్పుడు... అంటే సరిగ్గా సెప్టెంబర్ 10వతేదీ... 2023వ సంవత్సరంలో...  చంద్రబాబునాయుడి ని నంద్యాల పట్టణంలోని జ్ఞానపురంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నుండి ఉదయం 6 గంటల ప్రాంతంలో సీఐడీ అరెస్టు చేసింది. రూ. 371 కోట్ల నైపుణ్యాభివృద్ధి కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన కుట్రదారుడని మరియు "నెంబర్ 1 నిందితుడు" అని CID పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు తప్పుడు నష్టం మరియు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చే ఉద్దేశ్యంతో నాయుడు సూచనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడిందని ఏజెన్సీ తెలిపింది. ఈ సీన్ ఇప్పటికీ టీడీపీ నేతల కళ్ల ముందు కదలాడుతుంది. ఇలాంటి స్థితిలో జగన్ ఎప్పుడు కనపడతారని... పసుపు నేతలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి కళ్లల్లో ఆనందం నింపేరోజు దగ్గరలోనే ఉందనే సంకేతాలు టీడీపీ సర్కారు ఇస్తుంది. అంతేకాదు... అధికారంలోకి వచ్చి ఏడాది గడిచే లోపు.... జగన్ ని అరెస్ట్ చేసి లోపలేశారనే.. క్రెడిట్ కూటమి సర్కారు కొట్టేసే ఆలోచన చేస్తుంది. జనం మధ్యలో ఉన్న బాబుని ఎలాగైతే అరెస్ట్ చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారో... అలాగే... జనం మధ్యలో ఉన్న జగన్ ని... అరెస్ట్ చేసి... అదే రాజమండ్రి సెంట్రల్ జైళ్లో.... బాబు గడిపిన బ్యారక్ లోనే.. జగన్ ని ఉంచాలనే స్కెచ్ రెడీ అయినట్టు సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం... వందల కోట్లే.. కానీ లిక్కర్ స్కాం... వేల కోట్లు... అంటే బాబు కేసుతో పోలిస్తే... వందల రెట్లు ఎక్కువ... ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలం తీసుకెళ్లాలని చూస్తోంది చంద్రబాబు సర్కారు. అయితే జగన్ కు కూడా ఈ వ్యవహారంపై... ప్రత్యర్ధి కుట్రపై... పక్కా సమాచారం ఉన్నట్లే తెలుస్తుంది. అందుకే జనంలోకి రావడానికి... జనంలో తిరగడానికి... ఆయన భయపడుతున్నట్లు సమాచారం. ఎన్నో కార్యక్రమాల షెడ్యూల్స్ ను ప్రకటించి.. వెనకడుగు వేస్తున్నారు. మహా అయితే బెంగళూరు నుంచి పులివెందుల వచ్చి... అటు నుంచి అటే తిరిగి వెళ్లిపోతున్నారు గానీ... మిగిలిన ప్రాంతాల్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. 

జగన్ ను అరెస్ట్ చేయాలంటే...?

జగన్ ను అరెస్ట్ చేయాలంటే  కీలక ఆధారాలు కావాలి. లేదంటే ఒక అప్రూవర్ కావాలి. ఈ రెండు సోర్స్ లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు సమాచారం. ఆధారాలు అయితే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు... ఇప్పటికే కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు అందజేసినట్లు తెలుస్తుంది. ఇక అప్రూవర్ గా మారడానికి విజయసాయిరెడ్డి సిద్ధమవుతారని తెలుస్తుంది. అంతేకాదు ఆయన్ని అడ్డుపెట్టుకునే కూటమి సర్కారు కథ మొత్తం నడపాలని ఆలోచిస్తోందట. జగన్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి... వైసీపీలో ఏం జరిగిందో చెప్పగలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి మాత్రమే. ఇప్పుడు ఈయన వైసీపీకి దూరంగానే ఉన్నారు. ఈయన గనుక నోరు విప్పితే... జగన్ ను అరెస్ట్ చేయడం పెద్ద పనేం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అప్పట్లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది కాబట్టి... గవర్నర్ అనుమతి తప్పని సరి అయ్యింది. కానీ ఇప్పుడు జగన్ లిక్కర్ స్కాం విచారణను ఈడీతో చేయించాలని చూస్తున్నారు. అదే జరిగితే... గవర్నర్ అనుమతి చాలా సులభం అవుతుంది. దీంతో జగన్ అరెస్ట్ చాలా సులభం. సో... కేంద్రం హోంశాఖ నుంచి ఈడీకి గ్రీన్ సిగ్నల్ వస్తే...జగన్ అరెస్ట్ ఖాయమనేది రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. అదే గనుక జరిగితే తదుపరి కార్యచరణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది. జగన్ ను.. చంద్రబాబు ఉన్న సేమ్ జైలు... సేమ్ బ్యారక్ లోకి పంపి... తెలుగు తమ్ముళ్లను సంతృప్తి పర్చడమే తరువాయి భాగం అంటున్నారు రాజకీయ విమర్శకులు. అయితే ఈ వ్యవహారం అంతా... ఈ ఏడాదే జరుగుతుందా..? మరో 6నెలలు వెయిట్ చేయాలా అనేది కూడా... తేలాల్సి ఉంది

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..