కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలో అక్రమ మట్టి వ్యాపారం

By Ravi
On
కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలో అక్రమ మట్టి వ్యాపారం

కృష్ణజిల్లా బంటుమిల్లి మండలంలోని బాసినపాడు, ముంజులూరు, మణిమేశ్వరం గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధించి స్థానిక అధికారులు ఎటు వైపు కన్నెత్తి చూడటం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మట్టి వ్యాపారులు, అధికారులు, రాజకీయ నాయకుల సహకారంతో తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు అని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో, బంటుమిల్లి ఇన్చార్జి తహసిల్దార్ కాగిత పూర్ణచంద్రరావు వివరణ ఇచ్చారు. ఆయన మండల పరిధిలో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..