పిఠాపురంలో సంక్రాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం

By Ravi
On
పిఠాపురంలో సంక్రాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం

WhatsApp Image 2025-03-25 at 5.36.35 PMకాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ పాఠశాలలో సంక్రాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల నేత్ర బంధు కార్యక్రమం నిర్వహించారు. కిరణ్ కంటి ఆసుపత్రి వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 35 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి, కంటికి సంబంధించి సైటు ఉన్నవారికి ఉచితంగా కళాజోళ్ళు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి 15వ వార్డు కౌన్సిలర్ రాయుడు శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై, సంక్రాత్రి ఫౌండేషన్ వారు ఉచితంగా కళ్లజోళ్ళు ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఏ.వి. రామకృష్ణ మరియు పదో వార్డు కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంక్రాత్రి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర రావు గారి సేవలను కొనియాడారు. వారు విద్యార్థులకు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపి, సంక్రత్రి ఫౌండేషన్ తరఫున సత్యనారాయణ కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. రామకృష్ణ, రాయుడు శ్రీనుబాబు, అల్లవరపు నగేష్, లక్ష్మణరావు, శ్రీమతి సూర్య భవాని, ఏసు పాదం పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పిఠాపురంలో విద్యార్థులకు సౌకర్యంగా కంటి ఆరోగ్యం మీద అవగాహన పెంచే అవకాశం ఏర్పడింది.

Tags:

Advertisement

Latest News

కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..! కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!
ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో భాగంగా హైదరాబాద్ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు...
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!
అన్నివర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్..!
సన్‌రైజర్స్‌కి తప్పిన ముప్పు.. హుటాహుటీన తరలింపు..!
ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..!
కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి..!
ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..!