ఎస్ అండ్ పి గ్లోబల్ కంపెనీ పిల్లల కోసం ఆలోచించటం అభినందనీయం

నరసన్నపేట ఎమ్యెల్యే బగ్గు రమణమూర్తి

By Ravi
On
ఎస్ అండ్ పి గ్లోబల్ కంపెనీ పిల్లల కోసం ఆలోచించటం అభినందనీయం

WhatsApp Image 2025-03-25 at 11.40.02 AMపిల్లలు పార్కుల్లో ఇతరులతో కలిసి ఆడటం వల్ల వారి స్వీయమూల్యం పెరుగుతుందని నరసన్నపేట ఎమ్యెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలం, చిన్న కోవిరిపేట గ్రామంలో ఎస్ అండ్ పి గ్లోబల్ కంపెనీ సహకారంతో, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఫిట్నెస్ పార్క్ ను నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ప్రారంభించి మ్మాట్లాడుతూ ఎస్ ఎండ్ పి సంస్థ ప్రతినిధులు సహకారం మరువానిదని, పిల్లలు పార్కుల్లో ఆడటంతో ఉల్లాసంతో చదువుకు ఆటంకం కలగదని, ఆ ప్రాంతం యొక్క సహజ పర్యావరణాన్ని కాపాడటం, జీవ వైవిధ్య పరిరక్షణను పెంపొందించడమేనన్నారు. పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లలో గేమ్స్ ఆడుతూ చూడడం కంటే పార్కుల్లో ఆడుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి అభివృద్ధి చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుందన్నారు. సమాజంలోని ఇతర పిల్లలతో కలుసుకుని స్నేహం చేయడం ద్వారా వారు సహచరులలో ఉన్నత స్థానం సంపాదిస్తారని, దాని వల్ల వారికి సమాజంలో కలిసిపోవాలనే భావం కలుగుతుందన్నారు. 
పిల్లల కోసం పార్కులు కలిగి ఉండటం వల్ల, 
సామాజిక నైపుణ్యాలు, భావోద్వేగ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని, శారీరక చురుకుదనాన్ని పెంచుతాయన్నారు. సృజనాత్మకత, ఊహాశక్తిని, తెలివితేటల అభివృద్ధిని, 
నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఎస్ అండ్ పి గ్లోబల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సమాజంతో ముడిపడిన అనుబంధాలు పెంపొందుతాయని, కంపెనీ వాలంటీర్లు ఈ అంశాల ప్రాముఖ్యతను గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు వివరించగా, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి శారీరక కార్యకలాపాలకు సంబంధించిన ఆట స్థలాల్లో (పార్క్‌లలో) పంపించడానికి తోడ్పడతారన్నారు. 

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వరప్రసాదరావు పొట్నూరు, శ్రీధర్ కోతూరి,అశోక్ కుమార్ మద్ది, లక్ష్మీ కుమారి, ప్రాకెర్ల,వెంకట సురేష్ బాబు, చింతక్రిందీ, త్రినాదరావు మాస్టర్, డాక్టర్ బ్రహ్మం, రఘు, నాగరాజు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!