రూ. 8 లక్షల విలువైన ఓజీ కుష్ పట్టివేత – 203 గ్రాములు స్వాధీనం, ఇద్దరు అరెస్టు
సీఐ మహేష్ టీం దాడులు – అమీర్పేట్, నాంపల్లి ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు విజయవంతంగా పట్టుకున్న ఓజీ కుష్
ఏసీ ఎన్ఫోర్స్ విభాగం, సీఐ మహేష్ నేతృత్వంలో పోలీసులు అమీర్పేట్, నాంపల్లి ప్రాంతాల్లో రెండు చోట్ల దాడులు నిర్వహించి, రూ. 8 లక్షల విలువ చేసే 203 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అమీర్పేట్‌లోని శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో చల్లా నారాయణ శ్రీనిధి అనే వ్యక్తి వద్ద 101 గ్రాముల ఓజీ కుష్ అమ్మకాల నిర్వహిస్తున్నప్పుడు, ఏసీ ఎన్ఫోర్స్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం నాంపల్లి ఏరియాలో నరేందర్ కుమార్ అనే వ్యక్తి పూజ అమ్మకాలు జరుపుతుండగా అతని ఇంటిపై దాడి చేసి, 102 గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు కేసులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.
పట్టుకున్న టీం: సీఐ మహేష్, ఎస్సై వరద భూపాల్, కానిస్టేబుల్ వంశీ, పవన్ కృష్ణ, వినీత, ఉపేందర్ టీమ్ సభ్యులు పలు దర్యాప్తులు చేపట్టి ఈ మోసం చెయ్యడంతో నిందితులను అరెస్టు చేశారు.
ఎక్సైజ్ ఏసీ ఆర్. కిషన్ తాము స్వాధీనం చేసుకున్న గంజాయి/ఓజీ కుష్ గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందించారు.