భగత్ సింగ్ నగర్ దోబీ ఘాట్ లో పార్కు ఏర్పాటుకు డిమాండ్

By Ravi
On
 భగత్ సింగ్ నగర్ దోబీ ఘాట్ లో పార్కు ఏర్పాటుకు డిమాండ్

WhatsApp Image 2025-03-24 at 1.49.13 PM (1)హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని భగత్ సింగ్ నగర్, దోబీ ఘాట్ (మొగుళ్ళకుంట) ఎఫ్.టి.ఎల్ & బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మాణాలు జరగడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. గాజులరామారం సర్కిల్ పరిధిలోని ఈ ప్రాంతం గత సంవత్సరం నవంబర్ నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల సహకారంతో ఆక్రమించబడినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 2,000 గజాల స్థలంలో అక్రమ నిర్మాణాలు మరియు అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు.

ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, ఆ ప్రదేశంలో పార్కు ఏర్పాటుచేయాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి చింతల్ కాలనీ ప్రజలతో కలిసి డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారికి ఫిర్యాదు కూడా చేయబడింది. ఈ వారంలో చర్యలు తీసుకోకపోతే, డిప్యూటీ కమిషనర్‌పై హైడ్రా కమిషనర్ వద్ద ఫిర్యాదు చేస్తామని అధికారులకు తెలియజేశారు.

మరియు, జగద్గిరిగుట్ట పైప్‌లైన్ నుండి వచ్చే 30 ఫీట్ల నాలాను పునరుద్ధరించి, ఆ ప్రదేశాన్ని అందమైన పార్కుగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు సదానంద, ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్, పత్తి సతీష్, రాజేష్ చారి, పులి బలరామ్, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News