భారత స్వాతంత్ర సంగ్రామంలో "దొమ్మేటి" కృషి మరువలేనిది

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

By Ravi
On
భారత స్వాతంత్ర సంగ్రామంలో

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టి బలిజల యొక్క కృషిని కొనియాడారు. కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో శెట్టిబలిజ జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి 172వ జన్మదినం వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి భారత స్వాతంత్ర సంగ్రామంలో మహానుభావుడిగా నిలిచారని, ముఖ్యంగా వయోజన విద్యను ప్రోత్సహించి అనేక పాఠశాలలు, గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలలు స్థాపించి సమాజంలో విద్యా ప్రచారాన్ని విస్తరించినట్లు తెలిపారు. ఆయన సమానత్వం, ఆర్థిక సానుకూలత కోసం చేసిన కృషి మరిచిపోలేనిది అని కొనియాడారు.

ముఖ్యంగా బర్మాలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం స్థాపించి, ఆ జాతి అభివృద్ధి కోసం చేసిన కృషి, ఆయన స్థాపించిన పుస్తకాలను కూడా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, శెట్టిబలిజ సంఘాల పెద్దలు, మహిళలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..