పోలిసుల అదుపులో ప్రేమోన్మాది
TPN RAJASEKHAR SRIKAKULAM
02/04/25
- ప్రేమ ఉన్మాది,హత్యా నేరస్తుడుని చాకచక్యంగా ఛేదించి అదుపులోకి తీసుకున్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు.
- జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలతో నిరంతర గాలింపు తో పట్టుబడిన నిందితుడు.
- నిందితుని ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ గారు.
- జిల్లా పోలీస్ టీం వర్క్, సమన్వయంతో గంటల వ్యవధిలోనే నిందితుని గుర్తించడం జరిగింది.
వివరాలలోకి వెళ్తే: - విశాఖపట్నం,మధురవాడ, స్వయంకృషి నగర్ వద్ద బుధవారం మధ్యాహ్నం తల్లి, కూతుర్లు పై కిరాతకంగా కత్తితో దాడి చేసి పరారైన ప్రేమ ఉన్మాది శ్రీకాకుళం వైపు వస్తున్నట్లు ఉన్నతాధికారుల సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు డిఎస్పి సి.హెచ్ వివేకానంద పర్యవేక్షణలో ప్రత్యేకంగా నాలుగు పోలీఆ బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో,పక్కా సమాచారం తో నిరంతరం గాలిస్తూ నిందితుడిని బుధవారం సాయంత్రం జె.ఆర్ పురం సీఐ ఎం. అవతారం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది చాకచక్యంగా నిందితున్ని అదుపులోనికి తీసుకుని, తదుపరి చర్యలు నిమిత్తం విశాఖపట్నం సిటీ పోలీసు వారికి అప్పగించడం జరిగింది.
హత్యా నేరస్థుడు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించాడని సమాచారం మేరకు నిరంతరం గాలింపు, టీమ్ వర్క్, సమన్వయంతో నిందితుని చాకచక్యంగా చేదించడం కీలకంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు తో పాటు,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.