పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో సివిల్, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కొట్లాటలు, మిస్సింగ్ మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని, చట్ట పరిధిలో న్యాయబద్ధంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ, సంబంధిత పోలీసు అధికారులకు ఆయా ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం అందించాలన్నారు. ఈ అంశంపై నివేదిక రూపంలో ఎస్పీ నిర్ణీత సమయంలో జిల్లా పోలీసు కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ, పలాస పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.