కేంద్రం నుండి 10 కోట్లు మంజూరు అయినా వైయస్సార్ ప్రభుత్వ కాలయాపన

By Ravi
On
కేంద్రం నుండి 10 కోట్లు మంజూరు అయినా వైయస్సార్ ప్రభుత్వ కాలయాపన

శ్రీకాకుళం: గార మండలం కళింగపట్నం పాసింజర్ జట్టి క్రింద ఎంపిక జరిగి  కేంద్ర ప్రభుత్వం 2016 లో గుర్తించి కేంద్రం నుండి పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే గత వైయస్సార్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా కాలయాపన చేసిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దానికి సంబంధించి డిపిఆర్ ఇచ్చి కేంద్రానికి సిఫార్సు లేక రాయవలసిందిగా ముఖ్యమంత్రి ని కోరారు. వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి సీఎస్ రవిచంద్రకి అప్పగించి ఈ విషయం కేంద్రానికి లేఖ రాయమని ఆదేశించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో శంకర్ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Advertisement

Latest News