పర్యావరణ సమతుల్యత పక్షులతోనే 

By Ravi
On
పర్యావరణ సమతుల్యత పక్షులతోనే 

NV SURYA TUNI TPN MAR (20)

పర్యావరణ సమతుల్యత సాధనలో పక్షుల పాత్ర ప్రధానమైనదని జీవవైవిద్య రక్షక్  పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత, హరిత వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పోలుపర్తి దాలినాయుడు మాస్టారు తెలిపారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా తుని పట్టణంలోని వివిధ పాఠశాలలలో విద్యార్థులకు ఆయన అవగాహన సదస్సులు నిర్వహించారు వరి కంకులను కుంచెలుగా తయారుచేసి, దేవాలయాలు ఇండ్ల వసారాలలో వేలాడదీయడం అనాదిగా వస్తున్న ఆచారం అని ఆయన తెలిపారు దీని ద్వారా వేసవిలో పక్షులకు సంభవించే ఆహార కొరతను తగ్గించి పోషణ అందించవచ్చని ఆయన వివరించారు ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు దీనితో పాటుగా మట్టి పాత్రలలో తాగునీటిని ఏర్పాటు చేసి పక్షులను సంరక్షించాలని కోరారు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై పలు ఆసక్తికరమైన విషయాలను విద్యార్థులకు బోధించారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..