పశువులకు ,పక్షులకు సమస్త జీవకోటి జీవనాధారం నీరు -శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి
TPN RAJASEKHAR SRIKAKULAM
Date 02/04/25
పోలాకి, ఏప్రిల్ 02: పశువులు పక్షులు సమస్త జీవకోటి జీవనాధారం నీరు అని నరసన్నపేట శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు.పోలాకి మండలం, మబగాం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి నుండి కాపాడేందుకు నీటి తొట్టెలు ఏర్పాటు చేసేందుకు నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మూడు నెలలు నీటి ఎద్దడి ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు పశువులు పక్షులు సమస్త జీవకోటి జీవనాధారమైన నీటిని ఏర్పాటు చేసేందుకు గుంతలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో కూడా నీటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.