వంశధార ప్రాజెక్టు ను ఆధునీకరణ చేయాలి ౼ఎమ్మెల్యే ఎంజీఆర్

By Ravi
On
 వంశధార ప్రాజెక్టు ను ఆధునీకరణ చేయాలి ౼ఎమ్మెల్యే ఎంజీఆర్

TPN RAJASEKHAR SRIKAKULAM 
Date 20/03/2025

  • ఆయకట్టు చివరి ఎకరా వరకూ సాగునీరు అందించాలి  
  • లెఫ్ట్,రైట్ కెనాల్ లో 100 ఎంఎం సిసి లైనింగ్ ఏర్పాటు చేయాలి
  • ఆయకట్టులో భాగంగా ఎత్తైన భూములకు నీరందించడానికి అవసరమైన చోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేయాలి 
  • రైతులకు సాగునీరు అందించడంలో ఇరిగేషన్ పై మరోసారి అసెంబ్లీలో తన గళం వినిపించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ 

శ్రీకాకుళం జిల్లా వంశధార మా సిక్కోలు రైతులకు జీవన ధార,అలాగే వంశధార మా శ్రీకాకుళం జిల్లాకే తలమానికం అలాంటి వంశధార ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువలలో పూడిక తీసివేసి ఆధునీకరణ పనులు ప్రారంభించాలని ఇరిగేషన్ స్కీమ్ లపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మరోసారి తన గళాన్ని వినిపించిన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు... లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా 12 మండలాలలో సుమారు లక్షల యాభై వేలు ఎకరాలకు గానూ సాగునీరు అందించాలి అలాగే రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 7 మండలాలకు నీరు అందించే సామర్ధ్యం ఉన్నా గత ప్రభుత్వం పూర్తిగా ఇరిగేషన్ పథకాలపైనే కాకుండా రైతులపై కూడా చిన్న చూపు చూడడంతో కాలువలు మరమ్మతులకు గురై ఆయకట్టు వరకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ఎల్లప్పుడూ రైతుల శ్రేయస్సును కాంక్షించే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తక్షణమే చర్యలు చేపట్టి వంశధార ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులు చేపట్టి,అవసరమైన చోట ఎత్తైన ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు తోపాటు ప్రాజెక్టు లెఫ్ట్,రైట్ మెయిన్ కెనాల్ లో 100 ఎమ్ ఎమ్ సిసి లైనింగ్ ను ఏర్పాటు చేస్తే శ్రీకాకుళం జిల్లా రైతాంగం సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటుందని విన్నవించారు.

Tags:

Advertisement

Latest News