IPL-2025లో కొత్త రూల్స్

By Ravi
On
IPL-2025లో కొత్త రూల్స్


ఐపీఎల్‌-2025 (IPL 2025) ప్రారంభానికి ముందు బీసీసీఐ (BCCI) కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది. ఆటగాళ్లు జట్టు బస్సులో ప్రయాణించడం తప్పనిసరి చేసింది. గతంలో మాదిరి ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌ను నిర్వహించుకునే వెసులుబాటును నిషేధించింది. ప్రాక్టీస్‌ సెషన్లకు సంబంధించి పరిమితులు విధించింది.కొత్త రూల్స్‌ ప్రకారం ఒక్కో జట్టు ఏడు ప్రాక్టీస్‌ సెషన్స్‌ మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపింది. మ్యాచ్‌లకు ముందు అలాగే మ్యాచ్‌లు జరిగే సమయంలో  PMOA ప్రాంతాల్లో అంటే ఆటగాళ్లు మరియు మ్యాచ్‌ అఫీషియల్స్‌ ఏరియాల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఉండటాన్ని నిషేధించింది. ప్రాక్టీస్ రోజులలో డ్రెస్సింగ్ రూమ్‌లోకి మరియు మైదానంలోకి కేవలం గుర్తింపు పొందిన సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు ఆతిథ్య ప్రాంతం నుండి జట్టు ప్రాక్టీస్‌ను వీక్షించే వెసులుబాటును కల్పించింది. మ్యాచ్ రోజులలో ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించలేమని తెలిపింది. ఆటగాళ్ళు కనీసం రెండు ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్‌లను ధరించాలని పేర్కొంది. ప్రెజెంటేషన్ సెర్మనీలో ఆటగాళ్ళు స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించడాన్ని నిషేధించింది.ఈ ఏడాది ఐపీఎల్‌ ద్వారా అమల్లోకి రానున్న మార్పులు..

1. ప్రాక్టీస్ ఏరియాలో 2 నెట్‌లు మరియు రేంజ్ హిట్టింగ్ చేయడానికి ప్రధాన స్క్వేర్‌లో ఓ సైడ్ వికెట్ లభిస్తాయి. ముంబై లాంటి వేదికల్లో రెండు జట్లు ఒకే సమయంలో ప్రాక్టీస్ చేస్తుంటే, ఒక్కో జట్టుకు రెండు వికెట్లు లభిస్తాయి.

2. ఓపెన్ నెట్‌లు అనుమతించబడవు.

3. రెండు జట్లలో ఓ జట్టు ప్రాక్టీస్‌ను ముందుగానే ముగిస్తే, రెండో జట్టు ప్రాక్టీస్ కోసం ఆ వికెట్‌లను ఉపయోగించకూడదు.

4. మ్యాచ్ రోజులలో ఎటువంటి ప్రాక్టీస్‌కు అనుమతించబడదు.

5. ప్రధాన స్క్వేర్‌లో మ్యాచ్ రోజున ఫిట్‌నెస్ పరీక్ష జరగదు.

6. ప్రాక్టీస్ రోజులలో డ్రెస్సింగ్ రూమ్‌ మరియు మైదానంలోకి గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.

7. ఆటగాళ్ళు ప్రాక్టీస్ కోసం వచ్చే సమయంలో జట్టు బస్సును మాత్రమే ఉపయోగించాలి.

8. ఆటగాళ్ళు మరియు సహాయక సిబ్బంది LED బోర్డుల ముందు కూర్చోకూడదు.
9. మ్యాచ్‌ సమయంలో ఆటగాళ్ళు కనీసం రెండు ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్ ధరించాలి.

10. ప్రెజెంటేషన్‌ సెర్మనీలో స్లీవ్‌లెస్ జెర్సీలు అనుమతించబడవు.

11. గత సీజన్ల తరహాలోనే మ్యాచ్ రోజులలో జట్టు వైద్యుడుతో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.

Tags:

Advertisement

Latest News