సినీనటి కల్పికపై గచ్చిబౌలి పోలీసుల కేసు నమోదు

On
సినీనటి కల్పికపై గచ్చిబౌలి పోలీసుల కేసు నమోదు

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని ప్రిజం పబ్‌లో జరిగిన ఉదంతం నేపథ్యంలో సినీనటి కల్పికపై కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్‌కి వెళ్లిన ఆమె అక్కడ సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదులో, కల్పిక బిల్ చెల్లించకుండా ప్లేట్లు విసిరేసి, సిబ్బందిని బాడీ షేమింగ్ చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా బూతు పదజాలంతో దుర్భాషలాడినట్టు తెలిపారు. పోలీసుల సమక్షంలో కూడా ఆమె హంగామా చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు, కోర్టు అనుమతి తీసుకుని ఆమెపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయసంహితలోని 324(4), 352, 351(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలోనే ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Latest News