సిట్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు..

On
సిట్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు..

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ విచారణకు హాజరయ్యారు. 15 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరకున్నారు. పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు,  భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. ఈ కేసు నమోదైన సమయంలోనే ఆయన అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్ పోర్ట్ రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి 8.20 గంటల సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి.

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు