సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?
By V KRISHNA
On
కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర రింగ్ బస్తీ లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సాయి (27) అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గుడికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటల్లో కాలిపోయిన సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టీ మాట్లాడుతున్న క్రమంలో మొబైల్ పేలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
07 Jun 2025 22:11:00
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...