అక్రమంగా ఔషధాల విక్రయం.. డిసిఏ దాడి..

By Ravi
On
అక్రమంగా ఔషధాల విక్రయం.. డిసిఏ దాడి..

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారన్న  సమాచారంపై స్పందించి, మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, పోలేపల్లి గ్రామంలోని వాసు క్లినిక్ పై దాడి నిర్వహించారు. దర్యాప్తులో లింగంపేట శ్రీనివాసులు అనే వ్యక్తి డ్రగ్ లైసెన్స్ లేకుండానే ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో 12 రకాల మందులను అధికారులు గుర్తించారు. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారకాలు మరియు స్టెరాయిడ్లు ఉన్నాయని, ఈ దాడిని జడ్చర్ల డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రఫీ షేక్, మహబూబ్‌నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి. దినేష్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరిపి, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Latest News

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..
రైతుల కష్టం.. వర్షంతో నష్టం..
ప్రజలు ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. డీజీపీ జితేందర్..
ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం...
వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..
వాతావరణ శాఖ అధికారులతో.. టిజిఐసిసిసి డైరెక్టర్ సమావేశం..