ఎస్ఆర్ హెచ్ టిక్కెట్ల వివాదం.. నివేదిక ఇచ్చిన విజిలెన్స్..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ SRH టికెట్ల విషయం పై ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక చేరింది. ప్రిలిమినరీ రిపోర్ట్ ను విజిలెన్స్ డీజీ ప్రభుత్వానికి అందజేశారు.
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్ Hca సెక్రటరీ srh ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ చేశారు. టికెట్ల కోసం SRH యజమాన్యంని ఇబ్బందులకు గురిచేసినట్లు స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ సందర్భంగా పది శాతం టికెట్ల ను HCAకు SRH యాజమాన్యం ఇస్తోందని
మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై సెక్రటరీ వత్తిడి చేశారని నివేదికలో పేర్కొంది. ఫ్రీగా 10% టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ఆర్హెచ్ యజమాన్యం తేల్చి చెప్పడంతో ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని HCA సభ్యులు కోరినట్లు, Hca ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ ఒప్పుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పి టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా ఇరువురు మధ్య వివాదం జరిగిందన్నారు. ఎస్ ఆర్ హెచ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా విజిలెన్స్ నివేదికలో వెల్లడించారు. హెచ్సిఎ పై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది.