1600 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలి: డాక్టర్ కళ్యాణ్ నాయక్
10 శాతం కమిషన్ మంత్రి బట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 1600 కోట్ల సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నేత డాక్టర్ కళ్యాన్ నాయక్ ఆధ్వర్యంలో బాధితులు, బిజెపి నేతలు ఇండస్ట్రీస్ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ... 6 సంవత్సరాలుగా గిరిజనులకు సంబంధించిన 1600 కోట్ల రూపాయలు సబ్సిడీ పెండింగ్లో ఉందని గతంలో అధికారులు ఎన్నో చెక్కులు ఇచ్చి కాలయాపన చేస్తూ గిరిజనుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని వెంటనే రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్క గారు ఫైలు పై సంతకం చేయాలంటే అది శాతం కమిషన్లు సంతకాలు పెట్టడం లేదని ఆరోపించారు వెంటనే గిరిజనులకు రావాల్సిన సబ్సిడీలు విడుదల చేయకపోతే రాబోవు కాలంలో ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడి చేస్తామని ప్రభుత్వం మెడలు మంచి సబ్సిడీలు వచ్చేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు...