రెండేళ్లుగా తప్పించుకున్నాడు... చిన్న క్లూతో చిక్కాడు
By Ravi
On
బాలానగర్ పిపిఎస్ పరిధిలో జరిగిన కిడ్నాప్.. అత్యాచారం కేసు సుఖాంతం అయ్యింది. రెండేళ్లుగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 2023లో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్& రేప్ కేసులో రాబిన్ సన్(25) ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వైజాగ్ తీసుకెళ్లి 2రోజులు ఓ గదిలో నిర్బంధించి అత్యాచారం చేశాడు. బాలిక విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్&రేప్ కేసులో 2సంవత్సరాలుగా తప్పించుకు తీరుగుకున్న రాబిన్ సన్ ను అరెస్ట్ చేసినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. నిందితుడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.
Tags:
Latest News
22 May 2025 21:21:43
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ...