అల్లకల్లోలం.. తెల్లవార్లు నగర దిగ్భంధనం..

By Ravi
On
అల్లకల్లోలం.. తెల్లవార్లు నగర దిగ్భంధనం..

గతరాత్రి నగరంలో కురిసిన భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. అనేక ప్రాంతాలు, బస్తీలు, కాలనీలు చివరకు ప్రధాన రహదారులు సైతం వర్షం నీటితో నిడిపోయే చెరువుల మారడంతో నగరం మొత్తం దిగ్భంధనం అయ్యింది. ఇంటికి వెళ్లే సమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి పోయే దారిలేక తెల్లవార్లు వర్షంలోనే తడుస్తూ వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఎటు వెళ్లిన వర్షం నీరే పోయే దారిలేదు. కొన్ని చోట్ల నీటి తోడేందుకు స్థానిక ప్రజలు రోడ్లపై చేరి తంటాలు పడినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక లక్షల్లో వాహనాలు తిరిగే చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జ్ కింద పరిస్థితి చెప్పనక్కరలేదు. చిన్నపాటి వర్షం పడితేనే చిత్తడిఐపోయే ఆ దారి రాత్రి వర్షానికి పూర్తిగా నిండిపోయింది. చాలాచోట్ల బస్తీలలోని ఇండ్లల్లోకి నీరు వచ్చి జనం ఇబ్బందులు ఎదురుకొన్నారు. సీఎం అప్రమత్తంగాఉండాలని ఆదేశాలు జారీ చేసిన ఎక్కడ అధికారులు, సిబ్బంది జాడే లేదని జనం, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క వర్షానికే నగరం నరకంలా మారిందని రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని  నాలలు, డ్రైనేజ్ లు వెంటనే శుభ్రం చేయాలని కోరుతున్నారు.

Tags:

Advertisement

Latest News

17మంది ప్రాణాలు తీసిన ఇన్వర్టర్.... 17మంది ప్రాణాలు తీసిన ఇన్వర్టర్....
పాతబస్తీలో 17మంది మృతి చెందిన అగ్నిప్రమాదం ఘటనపై నివేదిక అందింది. ఇన్వర్టర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే గుల్జర్ హౌస్ ప్రమాదం చోటుచేసుకుందని ఫైర్ అధికారులు...
అల్లకల్లోలం.. తెల్లవార్లు నగర దిగ్భంధనం..
ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి
చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు