బంగారం పోయింది అని.. కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
By Ravi
On
బంగారం చోరీ అవడంతో మనస్తాపానికి గురై రెండున్నరేళ్ల కుమారుడితో బిల్డింగ్ పైనుండి దూకి ఓ మహిళ ఘాతుకానికి ఒడిగట్టింది. హైదరాబాద్ - చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణ (28) ఈ నెల 16న బంధువుల శుభకార్యానికి వెళ్లగా, తన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అవి దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధేష్ణ తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్‌తో పాటు మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధేష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
21 May 2025 21:30:00
చత్తీస్ ఘడ్ అడవుల్లో తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్...