తెలంగాణలో నకిలీ వైద్యులకు చెక్ పెట్టిన డిసిఏ అధికారులు

By Ravi
On
తెలంగాణలో నకిలీ వైద్యులకు చెక్ పెట్టిన డిసిఏ అధికారులు

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు  నకిలీ వైద్యుల భరతం పట్టారు.  'గ్రామీణ వైద్యుల' పేరిట పని చేస్తున్న నకిలీ వైద్యులపై ఆకస్మిక  దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  డ్రగ్ లైసెన్స్ లేకుండా అమ్మకానికి నిల్వ ఉంచిన ఔషధాలను గుర్తించారు.
...నకిలీ వైద్యులు వారి వివరాలు..
1. గుండ్లపల్లి నర్సింహ, శ్రీ బాలాజీ క్లినిక్, డోర్ నెం. 5-40, రావిర్యాల గ్రామం, తుక్కుగూడ మున్సిపాలిటీ, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా. 37 రకాల ఔషధాలు సీజ్..
2.మొహమ్మద్ మసూద్,  ఎయిడ్ సెంటర్, డోర్ నెం. 4-2-143, ఓల్డ్ దోర్నకల్ గ్రామం, దోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా. 39 రకాల ఔషధాలు సీజ్.
  క్లినిక్స్ వద్ద యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు, యాంటీ-అల్సర్ మందులు, నొప్పి నివారణ ఔషధాలు, ఐవీ ఫ్లూయిడ్స్ మరియు ఇన్‌ఫ్యూషన్ సెట్స్, కాన్యూలా వంటివంటి వైద్య పరికరాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. అదనంగా, 'సేల్‌కి కాదు' అనే లేబుల్ ఉన్న ఫిజిషియన్ శాంపిల్స్ మహబూబాబాద్ జిల్లా, ఓల్డ్ దోర్నకల్ గ్రామంలోని నకిలీ వైద్యుని క్లినిక్ వద్ద పెద్దఎత్తున నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ దాడుల్లో మొత్తం విలువ రూ. 50,147/- ఉన్న ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను జి. ప్రసాద్ (అసిస్టెంట్ డైరెక్టర్, రంగారెడ్డి), ఎం. అరవింద్ కుమార్ (అసిస్టెంట్ డైరెక్టర్, ఖమ్మం), డా. పి. శ్రావంతి రెడ్డి (డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, మహేశ్వరం), మరియు  ఎస్. ఉమారాణి (డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, మహబూబాబాద్) నిర్వహించారు. నిబంధనల ప్రకారం దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి
చత్తీస్ ఘడ్ అడవుల్లో  తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది.  ఆపరేషన్ కగార్...
చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి