రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి

By Ravi
On
రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి

రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో RCI రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గ్రానైట్ ట్రాక్టర్ ని బైక్ పై ఓవర్ టేక్ చేయబోయి  అఖిల్ అనే యువకుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హార్డ్వేర్ పార్కులో ప్రైవేట్ ఎంప్లాయ్ గా విధులు నిర్వహించుకుని బడంగ్పేట్ ఇంటికి  తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీ తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News