ఆ అబ్బాయిలకు.. అమ్మాయిలు దొరకరట.. పెళ్లిళ్లు కష్టమేనట..
అబ్బాయి పుట్టాడు అని సంబరపడకండి కన్యాశుల్కం మళ్లీ మొదలైంది
కేంద్రం ఇచ్చిన నివేదికలో బట్టబయలైన అసలు విషయం
అమ్మాయిల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందట
ఇక ఎదురు కట్నం ఇస్తేనే అబ్బాయికి పెళ్లి
అమ్మాయి చదువును బట్టి కన్యాశుల్కం
ఇవ్వను అంటే జీవితాంతం బ్రమ్మచారిగా మిగిలిపోవడం ఖాయం
కన్యాశుల్కం ఈ పేరు విన్నారా.. ఇప్పటి వారికి ఈ విషయం తెలియదు.. కానీ మన పెద్దలను అడిగితే చటుక్కున చెబుతారు. పూర్వం అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అమ్మాయి పుట్టింది అనగానే పురిటీలోనే ఆ చిన్నారికి నిండునూరేళ్లు నిండిపోయేవి. అలా ఒక వేళ జీవం పోసుకున్న అమ్మాయిలు చాలా తక్కువ దీనితో పెళ్లి చేసుకోవాలని భావించే వారు అమ్మాయి తల్లిదండ్రులకు కన్యాశుల్కం ఇచ్చి..అంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. ఆ తరువాత వరకట్నం మొదలైంది. అబ్బాయి చదువుకోకపోతే ఒక రేట్.. చదువుకుంటే దాన్ని బట్టి ఇంకో రేట్ ఫిక్స్ చేసి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. కట్నం వద్దు కానీ లాంఛనాలు, పెళ్లి ఘనంగా చేయాలి అంటూ ఆ రూపేణా అబ్బాయి వారు పిల్ల తల్లిదండ్రులకు భారీగానే ఖర్చు పెట్టిస్తున్నారు. బట్ ఇక అది చెల్లదు.. మీ అబ్బాయికి పెళ్లి కావాలి అంటే కన్యాశుల్కం ఇచ్చి ఎదురు లాంఛనాలు ఇచ్చి మీరే పెళ్లి ఖర్చులు భరించాలి. లేదంగే జీవితాంతం బ్రమ్మచర్యం తప్పదు. ఎస్ ఇదే నిజం.. తాజాగా ఓ నివేదిక ఇచ్చిన లెక్కల ప్రకారం ఆడపిల్లల సంఖ్య బాగా తెగ్గిందట.. కావాలంటే ఆ నివేదిక మీ ట్రూ పాయింట్ న్యూస్ లో వినండి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం విడుదల చేసిన ఒక రిపోర్టులో షాకింగ్ నిజం వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి అంతకంతకూ పెరుగుతోందన్న చేదునిజానికి సంబంధించిన గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని వెల్లడైంది. 2019లో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు పుడితే.. 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయికి పడిపోయింది. కేవలం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 922 మంది అమ్మాయిలే పుడుతున్న వైనం వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రంలో జననాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే జననాల రేటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,96,166 మంది పుడితే.. పట్టణ ప్రాంతాల్లో 4,15,485 మంది పుట్టినట్లుగా రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో 2021లో పుట్టిన పిల్లల్లో 3.18 లక్షల మంది మగ శిశువులకు 2.93 లక్షల మంది ఆడ శిశువులు పుట్టినట్లుగా గుర్తించారు. ఇక 2021లో కొవిడ్ కారణంగామరణాల సంఖ్య తెలంగాణలో 15.4 శాతం పెరిగిన విషయాన్ని వెల్లడించింది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1.08 లక్షల మంది చనిపోతే, పట్టణ ప్రాంతాల్లో 1.26 లక్షల మంది మరణించారు. 2021లో మొత్తం 2.34 లక్షల మంది చనిపోగా అందులో పురుషులు 1.35 లక్షలు కాగా మహిళలు 98 వేల మంది ఉన్నారు. నవజాత శిశువుల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చనిపోయారని నివేదిక తెలిపింది. 2021లో మొత్తం 2.34 లక్షల మంది చనిపోతే అందులో 76 శాతం మంది 55 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో 35-44 ఏళ్ల వయసు వారు 12 వేల మంది, 45-54 మధ్య వయసు వారు 22 వేల మంది, 55-64 మధ్య వయసున్న వారు 42 వేల మంది, 65-69 ఏళ్ల మధ్య వయస్కులు 85 వేల మంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 51 వేల మంది మరణించారు. నవజాత శిశు మరణాల్లో మొదటి స్థానం హైదరాబాద్ కాగా, రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది. తెలంగాణలో 2021లో మొత్తం 6.11 లక్ష లమంది పుడితే ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే 95,666 మంది పుట్టగా అతి తక్కువగా ములుగు జిల్లాలో 3868 మంది మాత్రమే పిల్లలు పుట్టారు. జననాల విషయంలో హైదరాబాద్ తర్వాత మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు నిలిచాయి. సో ఏదిఏమైనా లెక్కలు పక్కన పెడితే అమ్మాయిల సంఖ్య బాగా తగ్గిపోయిందని తెలుస్తోంది. అబ్బాయి పుట్టారు అని ఆనందంతో గంతులు వేసే తల్లిదండ్రులు కొడుకు పుట్టగానే అతడి పెండ్లి ఖర్చులతో పాటు ఎదురు కట్నం రెడీ చేసుకోండి మరి.. ఆల్ ది బెస్ట్. బ్రదర్స్.