అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

By Ravi
On
అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

అందరికీ అందుబాటులో సులభంగా ఉండే విధంగా భూ భారతి చట్టం తయారు చేయడం జరిగిందని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలో రైతు వేదికలో భూ భారతి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, IMG-20250428-WA0182తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకోని వచ్చిన భూ భారతి కొత్త చట్టంపై రైతులకు వివరించారు. రైతుల భూ సమస్యలు, కష్టాలు తదితర వాటిని ఎలా పరిష్కారం పొందవచ్చు రైతులకు వివరించారు. గత పాలకులు ధరణి పేరుతో రైతులను, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేశారని అన్నారు. ధరణి వల్ల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని అలనాటి టిపిసిసి అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి నీ తీసేసి వేస్తామని చెప్పారని. అన్నట్టుగా భూ భారతి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ చట్టాన్ని అందరికీ అనుకూలమైన విధంగా రైతులకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరియు రెవెన్యూ సీనియర్ అధికారులు అధ్యయనం చేసి ఈ భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ చట్టం ద్వారా సులభంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి రైతులకు ,సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చట్టం తీసుకురావడం జరిగిందని దీని ద్వారా ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారం జరుగుతుందని అన్నారు. రైతులకు ప్రజలకు అవగహన కల్పించేందుకే ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టం సదస్సు ఉంటుందని తద్వారా చట్టం అమలు  అవగహన పూర్తి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ తో పాటు రెవెన్యూ అధికారులు మండల ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలోని కందెనేల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభ ప్రతి గడ్డం ప్రసాద్ కుమార్, చిప్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

 

Tags:

Advertisement

Latest News

తెలంగాణ డీజీపీ రేసులో 8మంది సీనియర్ ఐపిఎస్ లు తెలంగాణ డీజీపీ రేసులో 8మంది సీనియర్ ఐపిఎస్ లు
ఐఎఎస్ ల బదిలీ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక డీజీపీ నియామకంపై దృష్టి సారించింది. ఇందుకు గాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 8 మంది...
గుండ్లపోచంపల్లిలో ఫ్యాన్స్ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
యాచారంలో తీవ్ర ఉద్రిక్తత.. డ్రైనేజ్ విషయంలో ఘర్షణ. హోంగార్డు మృతి
అందరికీ అందుబాటులో సులభంగా భూ భారతి చట్టం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం