కూకట్పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడి హత్య

By Ravi
On
కూకట్పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడి హత్య

కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది. యువకుడిని హత్య చేసింది. గత రాత్రి సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌ సమీపంలో ఉన్న పార్కులో ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా అపార్టుమెంట్ వాచ్మెన్‌తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందాడు. నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నాడు. వెంకటరమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags:

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు