ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...

By Ravi
On
 ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్లు  పాపులర్ అయ్యాయి. భారత త్రివిధ దళాలకి చెందిన ఈ ఇద్దరు అధికారులు "ఆపరేషన్ సింధూర్" అనంతరం మీడియా సమావేశాల్లో పాలు పంచుకుంటూ, కేంద్రం తీసుకున్న వ్యూహాత్మక చర్యల గురించి వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ధైర్యసాహసాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి.అయితే, వీరి పేర్ల పాపులారిటీని వాడుకొని సోషల్ మీడియాలో కొందరు నకిలీ ఖాతాలు సృష్టించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వీరి పేర్ల మీద ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వీటిలో చాలా ఖాతాలకు బ్లూ టిక్ ఉండటంతో అవే అధికారిక ఖాతాలుగా నమ్మి నెటిజన్లు సైతం ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర సమాచార శాఖకి చెందిన పీఐబీ ఫ్యాక్ట్చెక్ ఈ ఖాతాలన్నీ నకిలీవని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ప్రజలు ఎప్పటికీ ప్రభుత్వ శాఖల ధృవీకరించిన ఖాతాలనే అనుసరించాలని సూచించింది. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పాత్రల్ని గౌరవించడంతో పాటు, అపోహలు పెరగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పీఐబీ హెచ్చరించింది. ఆయా ఖాతాలు తెరిచిన వారి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు.

Tags:

Advertisement

Latest News

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...